Singer: | రమణ గోగుల, మధుప్రియ |
Composer: | భీమ్స్ సిసిరోలియో |
Music: | భీమ్స్ సిసిరోలియో |
Lyrics
గోదారి గట్టు మీద రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న సందమామవే
ఊరంతా సూడు ముసుకే తన్ని నిద్దరపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే ఎం బాగుంటుందే
నాకంటూ ఉన్న ఒకే ఒక్క అడదిక్కువే
నీతోటి కాకుండా నా బాధలు ఎవ్వరికి చెప్పుకుంటానే
గోదారి గట్టు మీద రామ సిలకనే
హ.. గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే
హేయ్ విస్తార మందేసి పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే
ఛి ఛి ఛి సిగ్గెలేని మొగుడువారండోయ్
గుయ్ గుయ్ గుయ్ అంటూ మీదికిరాకండోయ్
వయ్ వయ్ వయ్ గంపెడు పిల్లల్తో ఇంటిని నింపవే
చాప దిండు సంసారాన్ని మెడెక్కించావే
ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దుయ్య
గురుకెట్టి పడుకోరే గూర్కాలాగా మీవాళ్లు...
ఎం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు
పెళ్లయ్యి సానాల్లే అయినా గాని మాస్టారు
తగ్గేదే లేదంటూ నా కొంగేనకే పడుతుంటారు
హేయ్.. గోదారి గట్టు మీద రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న సందమామవే
కొత్త కోకేమో కన్నె కొట్టింది
తెల్లరేగలోగా తొందర పడమని చెవిలో చెపిందే
ఈ మాత్రం హింటే ఇస్తే సెంటె కొట్టైనా
ఓ రెండు మూరల మల్లెలు చేతికి చూటైన
ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం మానేయ్ మంటుందే
అబ్బాబ్బ కబాడీ కబాడీ అంటూ కూతకు వచైనా
ఏవండోయ్ శ్రీవారు మల్లి ఎప్పుడో అవకాశం
ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం
హేయ్ ఓసోసి ఇల్లాల బాగుందే నీ సహకారం
ముద్దుల్తో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం...
గోదారి గట్టు మీద రామ సిలకనే (హుమ్ హుమ్ లలలా)
"గోదారి గట్టు మీద రామ సిలకవే" అనే పండుగ పాటను వెంకటేష్ గాయించారు, దీనిని భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి వంటి నటీనటులు కూడా ఉన్నారు, ఇది ప్రేక్షకుల ఆకర్షణను పెంచుతుంది. హాస్యం మరియు భావోద్వేగాలను కలుపుతూ ఈ చిత్రం అన్ని వయస్సుల ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అనుభూతి చెందించేందుకు ఉద్దేశించబడింది.
0 Comments
If you have any questions, please let me know